Trending Now

ముస్లిం మైనార్టీల హక్కులపై భవిష్యత్ కార్యాచరణ..

ప్రతిపక్షం, సిద్దిపేట ఏప్రిల్ 18: బహుజన ప్రజా సంఘాల సిద్దిపేట జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం గురువారం సిద్ధిపేట ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా బహుజన ప్రజాసంఘాల జిల్లా నాయకులు కొమ్ము దుర్గారాములు, దబ్బేట ఆనంద్ లు మాట్లాడుతూ.. బహుజన ఎస్సీ ఎస్టీ, బీసీ మైనార్టీల కార్మిక, కర్షక ప్రజల సమస్యలపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. ఇందులో ప్రజల స్థానిక సమస్యలపై భవిష్యత్తు కార్య చరణ రూపొందించామని అదేవిధంగా బహుజన మహాసభ వేదికలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల సంఘ నిర్మాణంలో భాగంగా ముస్లిం మైనార్టీ సిద్దిపేట జిల్లా కమిటీ వేయడం జరిగింది.

సిద్దిపేట జిల్లా “ముస్లిం హక్కుల పోరాట సమాఖ్య “(M H P S) కన్వీనర్, కో కన్వీనర్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇందులో ముస్లిం మైనార్టీల హక్కులపై భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకొని వారి సమస్యలపై పోరాటం చేస్తామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నూతనంగా (M H P S) జిల్లా బాధ్యులుగా నియమించబడ్డ కన్వీనర్ కో కన్వీనర్ షేక్ దస్తగిరి,ఎస్ కే సల్మాన్ మాట్లాడుతూ.. సావిత్రిబాయి పూలే సమకాలికురాలైన ఫాతిమా షేక్, షహీద్ అశ్వతుల్లా ఖాన్, సోయా ఉల్లా ఖాన్ ల స్ఫూర్తితో పనిచేస్తామని తెలిపారు. ముస్లిం మైనార్టీ హక్కుల కోసం పోరాడుతున్న తమకు ముస్లిం మైనార్టీ ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎండి చాంద్, ఎస్.కె ఇస్మాయిల్, గఫర్, యాకూబ్, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News