ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: చేవెళ్ల పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిని మహేశ్వరం నియోజకవర్గం సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బేర బాలకిషన్(బాలన్న )ఆకుల అరవింద్ కుమార్ లు రంజిత్ అన్న ఫామ్ హౌస్ లో స్వయంగా కలిసి పార్లమెంట్ ఎన్నికల్లో సరూర్ నగర్ డివిజన్ రామకృష్ణాపురం డివిజన్లో ఎన్నికల్లో అనుసరించాల్సిన ఎన్నికల ఫ్యూహo పై సుదీర్ఘంగా చర్చించారు. పార్లమెంట్ ఎన్నికల్లో రంజిత్ రెడ్డి ని పార్లమెంట్ సభ్యునిగా భారీ మెజార్టీతో గెలుపే లక్ష్యంగా మహేశ్వరం అర్బన్ ప్రాంతంలో పకడ్బందీ ఫ్యూహం తో భారీ మెజార్టీ తీసుకురావడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా బేరాబాల కిషన్ (బాలన్న )ఆకుల అరవింద్ కుమార్ తెలిపారు.