ప్రతిపక్షం, వెబ్ డెస్క్: తెలంగాణ సర్కార్ 10వ తరగతి విద్యార్థులకు శుభవార్త చెప్పింది. కొంత కాలం నుంచి అమలులో ఉన్న నిమిసం నిబంధన ఎత్తివేసింది. పరీక్షా కేంద్రానికి హాజరయ్యేందుకు 5నిమిషాల గ్రేస్ ట్రైం ను ప్రకటించింది. మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరడనున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులకు కాస్త టెన్షన్ లేకుండా రావచ్చని భావిస్తున్నారు. అయితే.. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతాయి. కానీ ప్రభుత్వం ప్రకటించిన గ్రేస్‌టైమ్ కారణంగా విద్యార్థులను ఉదయం 9.35 గంటల వరకు కేంద్రంలోకి అనుమతించారు.