ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
ప్రతిపక్షం, ప్రతినిధి రాజన్న సిరిసిల్ల, మే 16: బీఆర్ఎస్ రైతులపై మొసలి కన్నీరు కారుస్తుందని, వారికి ఇప్పుడు రైతుల గుర్తుకొచ్చారా అని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా చందుర్తి మండల కేంద్రంలో మీడియా సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ వారు నేడు రైతుల కోసం దీక్షలు చేస్తున్నది.. రైతులపై మొసలి కన్నీరు కారుస్తూ.. రైతులపై వారికి కపట ప్రేమ తప్ప మరిమీ లేదు. 10 సంవత్సరాలు పరిపాలన చేసి వరి వేస్తే ఉరి అన్నటువంటి కేసీఆర్ సర్కార్.. గతంలో అకాల వర్షాల వల్ల నష్టాల నష్టపోయిన రైతులకు పది వేల పరిహారం ఇస్తామని చెప్పి మోసం చేశారు. రైతులు ఇబ్బందులు పడితే పట్టించుకోని వారు అధికారం పోయాక రైతుల కోసం రావడంలో అంతర్యమేమి. మా ప్రభుత్వం అధికారులకు వచ్చాక రైతులకు మేలుకొరీ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం.
ప్రజలు రాష్ట్రంలో మన ప్రభుత్వానికి అధికారమిచ్చాక గత పాలకులు రాష్ట్రాన్ని ఆరు లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చిన ప్రజా సంక్షేమాన్ని కొనసాగిస్తూ ముందుకు పోతున్నాం.. రైతుబంధు రైతుల ఖాతాలో జమ చేశాం, పెన్షన్లు కూడా ప్రతి నెల ఇస్తున్నాం.. ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీకున జీతాలు ఇస్తున్నామన్నారు. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితమవుతున్న బీఆర్ఎస్ పార్టీ వారు తమ ఉనికి కోసం మాట్లాడుతున్నారు. కేటీఆర్ మాట్లాడుతూ వడ్లు కొనుగోలు చేయడం లేదని అనడం వారి విచక్షణకే వదిలేస్తున్నాం.. మీకు లెక్కలు కావాలంటే ట్విట్టర్ లో కూడా పంపిస్తాం.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో మే 15 వరకు 8,6364 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే.. మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మే 15 వరకు 1,90,948 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం అని తెలిపారు.
మీకంటే ఇప్పటివరకు మేము 1 లక్ష మెట్రిక్ టన్నుల ఎక్కువ కొనుగోలు చేశాం. మీలాగా మేము నిద్రపోవడం లేదు రైతుల కోసం పనిచేస్తున్నాం.. ఆనాడు రైతులకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు వేస్తూ.. రైతులను నిలువు దోపిడీ చేసిన మాట వాస్తవం కాదా.. అని ప్రశ్నించారు. ఈసారి మేము ఏ విధంగా కొనుగోలు చేస్తున్నామో రైతుల అందరికీ తెలుసు.. అది మా ప్రభుత్వానికి రైతులపై ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. గత ఎన్నికల్లో చెప్పినట్లు గానే వచ్చే వర్షాకాలం పంటకి రైతులకు 500 బోనస్ ఇస్తాం. ఆగస్టు 15 వరకు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్నటి రోజు అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి రుణమాఫీపై సాధ్యసాధ్యాలను ఇతర రాష్ట్రాలకు వెళ్లి పరిశీలించాలని సూచించారు.
త్వరలోనే రైతుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఈరోజు మీరు చేసే దీక్షలను చూస్తుంటే రైతులపై కల్లబొల్లి ప్రేమ వలకబోస్తున్నారు. మరోవైపు బీజేపీ ఎంపీ లక్ష్మణ్, కిషన్ రెడ్డి రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోతుందని అనడం విడ్డూరం. అసలు ఈ ఆర్థిక సంక్షోభానికి కారణం మీ బీజేపీ దోస్త్ బీఆర్ఎస్ వారే కదా.. రాష్ట్రంలో నిజంగానే ఆర్థిక సంక్షోభం తలెత్తితే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆదుకోవాల్సింది పోయి మీరు చేసే విమర్శలు బట్టి చూస్తే రాష్ట్రంపై మీకు ఏమాత్రం ప్రేమ లేదనిపిస్తుంది. బీజేపీ, బీఆర్ఎస్ వారు చేస్తున్న వాటిని ప్రజలంతా గమనించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.