ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ 23 : శ్రీ వీర హనుమాన్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని మంగళవారం పట్టణంలోని భాగ్యనగర్ భక్తంజనేయ మందిరం, భాగ్యనగర్ రాధాకృష్ణ మందిరం, బాలాజీవాడ వీరాంజనేయ మందిరం, ఆదర్శనగర్ శ్రీ వీరా హనుమాన్ ఆలయం, ఖిల్లా గుట్టా హనుమాన్ ఆలయం, బంగల్ పేట్ దర్వాజా హనుమాన్, ప్రియదర్శిని నగర్ అభయాంజనేయ మందిరం పలు ఆలయాలను సందర్శించి, శ్రీ ఆంజనేయస్వామి వారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. పండితులు ఆశీర్వచనాలు అందచేసి, తీర్థ ప్రసాదాలు అందచేశారు. అనంతరం ఆలయాల్లో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ మాట్లాడుతూ.. శ్రీ ఆంజనేయస్వామి జయంతోత్సవము సందర్భంగా ఆలయలకు భక్తులు ఉదయం నుండే భారీ ఎత్తున వచ్చి స్వామి వారిని దర్శించుకుంటున్నారని, అంజనిపుత్రుని కృపా కటాక్షాలు ప్రజలందరి పై ఉండాలని, ప్రార్థించారు. పలువురు కౌన్సిలర్లు,ఆయా ఆలయ కమిటీ సభ్యులు,ప్రజాప్రతినిధులు, తదితరులు ఉన్నారు.