ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలతో పాటు భారీ వర్షాలు, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడ.. అక్కడ కురిసే అవకాశం వుంది. హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 36డిగ్రీలు, 25 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు పశ్చిమ, వాయువ్య దిశలో వీచే అవకాశం ఉంది.
గాలి వేగం గంటకు 6 – 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 36.1 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24.1 డిగ్రీలుగా నమోదైంది. 75 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది. నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, కర్ణాటకలోని చాలా ప్రాంతాలకు, మహారాష్ట్ర, తెలంగాణ, కోస్తాంధ్రలోని మరికొన్ని ప్రాంతాలకు, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని చాలా ప్రాంతాలకు, వాయువ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.