Heavy rush at Khairtabad Maha Ganapati Temple: వరుస సెలవులు (రెండో శనివారం, ఆదివారం, వినాయక నిమజ్జనం, బక్రీద్) రావడంతో హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలన్నీ రద్దీగా మారాయి. ఇక ఖైరతాబాద్ మెట్రో స్టేషన్, ఎంఎంటీఎస్ మెట్రో స్టేషన్ అయితే ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. మహా గణేశుడి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. దీంతో మెట్రో రైలు యాజమాన్యం భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తోంది. టికెట్ కౌంటర్లు, ఎగ్జిట్ గేట్ల వద్ద రద్దీ పెరగకుండా తగిన చర్యలు చేపట్టింది. క్యూఆర్ కోడ్ టికెట్లకు, కార్డ్ ద్వారా వెళ్లే ప్రయాణికులను వేర్వేరుగా పంపిస్తోంది.



























