High Court notices to HYDRA Commissioner: హైడ్రాకు హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. తాజాగా, కోర్టుకు హాజరుకావాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అమీన్‌పూర్ చెరువుకు సంబంధించిన ఓ కేసు విషయంలో విచారణ సందర్భంగా కోర్టు ఆదేశాలిచ్చింది. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో హాజరై ఆమీన్‌పూర్ చెరువు అంశంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కోర్టులో పెండింగ్‌లో ఉన్న భవనాన్ని ఎలా కూలుస్తారని కమిషనర్‌ను ప్రశ్నించింది. ఈ నెల 30న ఉదయం 10.30 నిమిషాలకు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.