ప్రతిపక్షం, వెబ్ డెస్క్: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్సీల పేర్లను మళ్లీ కేబినెట్‌లో ప్రతిపాదించి గవర్నర్‌కు పంపాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మళ్లీ కొత్తగా ఎమ్మెల్సీల నియామకం చేపట్టాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. కోదండరాం, అమీర్ అలీఖాన్ లను నియమిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ ను కొట్టిపారేసింది. కొత్తగా ఎమ్మెల్సీల నియామకం చేపట్టాలని ఆదేశించింది. మంత్రి మండలి నిర్ణయానికి గవర్నర్ కట్టుబడి ఉండాలని సూచించింది. ఎమ్మెల్సీల నియామకంపై ప్రభుత్వం పున:సమీక్ష్మించుకోవాలని తెలిపింది.