ప్రతిపక్షం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో వైసీపీ మూకల అరాచకానికి హద్దు లేకుండా పోతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఎక్స్ లో విమర్శించారు. పూజ సరిగా చేయలేదంటూ.. కాకినాడలోని ఓ గుడిలో పూజారులపై వైసీపీ నేత దాడి చేశారని ఆరోపించారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతలు ఆటవిక చర్యలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు.