, పట్టుకొని బంధించిన గ్రామస్తులు
ప్రతిపక్షం ప్రతినిధి, నారాయణపేట్ జిల్లా ఫిబ్రవరి 24
రాయికోడ్ గ్రామం లో భారీ మొసలి పట్టుకొని తాళతో బంధించరు గ్రామస్తులు ఈ రోజు ఉదయం అటుగా వెళ్తున్న ఓ రైతు పొలలాలో అటుగా తిరుగుతున్న భారీ ఆకారంలో ఉన్న మొసలి ను చూసి, సర్పంచ్, పి సుశీల, కు ఫోన్ చేయగా గ్రామస్తులు అందరూ కల్సి తాళతో బందించారు. తర్వాత డిప్యూటీ సర్పంచ్ మ్యాతారి గోపాల్ ఫోన్ లో ఫారెస్ట్ ఆఫీసర్స్ కి సమాచారం ఇవ్వగా వారు వెంటనే స్పందించి మహబూబ్నగర్ నుంచి వచ్చి, ఆ మొసలి ని గ్రామ ట్రాక్టర్ లో వేసుకోని జూరాల డ్యామ్ లో సేఫ్ గా వదిలి పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమలో ఆ గ్రామ డిప్యూటీ సర్పంచ్ మ్యాతారి గోపాల్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసార్ పద్మారావు ధన్వాడ, మక్తల్ సెక్షన్ ఆఫీసర్ వెంకటశ్వర్లు, డ్రైవర్ మచ్చనపల్లి నర్సింహా ఆ గ్రామస్తులు, రైతులు యూవకులు పాల్గొన్నారు.





























