Trending Now

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులచే అక్షర శ్రీకారం..

ప్రతిపక్షం, హుస్నాబాద్, జూన్ 15 : ‘బడిబాట’ కార్యక్రమంలో భాగంగా శనివారం రోజున సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో నూతనంగా ఈ విద్యా సంవత్సరం పాఠశాలలో చేరిన విద్యార్థులకు హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత ‘అక్షర శ్రీకారం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడాతూ.. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనంతో పాటు సూసిక్షితులైన ఉపాధ్యాయులు, ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, ఎక్కరూప బట్టలు అందించి విద్యార్థులకు ఎలాంటి ఆర్ధికభారం లేకుండా సకల సౌకర్యాలను కల్పించి ఉచితముగా నాణ్యమైన విద్యాను అందిస్తోదని దీనిని ప్రతి విద్యార్ధి ఉపయోగించుకొని ఉత్తమ విద్యార్థులుగా తయారుకావాలని చైర్ పర్సన్ సూచించారు. విద్యార్థిని విద్యార్థులకు ఉచితపాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, ఏకరూప దుస్తులను విద్యార్థుల అందించారు ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు లావుడ్యా లింగ్యానాయక్ అధ్యకత వహించగా మున్సిపల్ వైస్ చైర్మన్ ఐలేని అనిత, వార్డ్ కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్, అమ్మ ఆదర్శ కమిటీ అధ్యక్షురాలు శీలం సంధ్య, ఉపాధ్యాయులు యాదయ్య, రవీందర్, అనురాధ తదితరులు పాలుగోన్నారు.

Spread the love

Related News

Latest News