ప్రతిపక్షం, హైదరాబాద్, ఫిబ్రవరి 11:
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసింది. జీహెచ్ఎంసీ తో పాటు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ), సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ)లను ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదల చేసింది. అలాగే ఈ మూడు కార్పొరేషన్లకు కమిషనర్లను కూడా నియమించింది. జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఆర్ వీ కర్ణన్ ను యథాతథంగా కొనసాగించిన ప్రభుత్వం సైబరాబాద్ కు శ్రీజన, మల్కాజిగిరికి వినయ్ కృష్ణారెడ్డిని కమిషనర్లుగా నియమించింది. జీహెచ్ ఎంసీ లోని 150 డివిజన్లు డి లిమిటేషన్ లో భాగంగా 243 డివిజన్లుగా ఏర్పడ్డాయి. వీటితో పాటు విలీనమైన మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు 57 డివిజన్లుగా ఏర్పాటయ్యాయి. పరిపాలన సౌలభ్యం, అధికార వికేంద్రీకరణ లక్ష్యంగా జీహెచ్ ఎంసీని మూడు కార్పొరేషన్లుగా ప్రభుత్వం విస్తరించింది. 300 డివిజన్లతో జీహెచ్ ఎంసీ బృహత్ నగరపాలక సంస్థగా ఏర్పడింది.




























