KTR accuses Revanth Reddy of Rs 8,888 crore scam: సీఎం రేవంత్ రెడ్డి అమృత్ టెండర్ల పేరిట భారీ అవినీతికి తెరలేపారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తన బావమరిది సూదిని సృజన్ రెడ్డి కోసం ఈ స్కామ్ చేశారని విమర్శించారు. అలాగే ఈ కుంభకోణంలో రేవంత్ సీఎం పదవి కూడా కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పారు. రేవంత్ రెడ్డి రూ.8,888 కోట్ల భారీ స్కాం చేశారని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన అన్ని సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని వెల్లడించారు.
మున్సిపాలిటీల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమృత్ అనే పథకాన్ని తీసుకొచ్చారని, ఈ స్కీమ్‌లోనే సీఎం రేవంత్, తన బావమరిది సృజన్ అక్రమాలకు పాల్పడ్డారని కేటీఆర్ ఆరోపించారు. పేరుకే ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ అయినా రేవంత్ రెడ్డి బావమరిది కోసం ఈ టెండర్లను కట్టబెట్టారని కేటీఆర్ ఆరోపించారు. ఇంత అవినీతి జరుగుతున్న బీజేపీ ఎంపీలు నోరు ఎందుకు మెదపడం లేదని ప్రశ్నించారు.