Trending Now

HYDRA Special Focus: హైడ్రా మరో సంచలన నిర్ణయం..అధికారులపై క్రిమినల్ కేసులు!

HYDRA Special Focus On Illegal Officers: హైడ్రా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. చెరువు స్థలాల్లో కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై స్పెషల్ ఫోకస్ పెట్టింది.. అధికారులపై చర్యలు తీసుకోవాలని హైడ్రా ఆదేశాలు జారీ చేసింది. గండిపేట, మాదాపూర్ పరిసరాల్లో కట్టడాలకు అనుమతి ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోనుంది. ఈ మేరకు ఐదుగురు ఉన్నతాధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని హైదరాబాద్ కమిషనర్‌కు హైడ్రా సిఫార్సు చేసింది. ఇప్పటికే హెచ్ఎండీఏలో అక్రమంగా అనుమతులు ఇచ్చిన అధికారు జాబితాను సైతం హైడ్రా సిద్ధం చేసింది.

హైడ్రా పలువురు అధికారులపై ఫిర్యాదు చేసింది. ఇందులో నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్, చందానగర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్, హెచ్ఎండీఏ ఏపీఓ, బాచుపల్లి తహసీల్దార్, మేడ్చల్ జిల్లా సర్వే ఏడీపై చర్యలు హైడ్రా సిఫార్స్ చేసింది.

Spread the love

Related News

Latest News