Trending Now

లింగ నిర్ధారణ చేపడితే కఠిన చర్యలు..

పీసీ, పీఎన్డీటీ జిల్లా సలహా కమిటీ సమావేశం

ప్రతిపక్షం, సిద్దిపేట, మే 27: గర్భధారణ పూర్వ, గర్భస్థ పిండ ప్రక్రియ (లింగ ఎంపిక నిషేధ) చట్టం 1994, రూల్స్ 1996 ఉల్లంఘించిన సెంటర్ల, యాజమాన్యాలు, లింగ నిర్ధారణ చేపడితే వారి పీసీ, పీఎన్డీటీ ఆక్ట్ ప్రకారం చట్టరీత్యా చర్యలు చేపడతామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ తెలిపారు. సోమవారం సిద్దిపేట కలెక్టరేట్ లోనీ జిల్లా కార్యాలయంలో పీసీ, పీఎన్డీటీ చైర్ పర్సన్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన పీసీ, పీఎన్డీటీ జిల్లా సలహా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గర్భంలో బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడా లేదా, ఏమైనా అంగవైకల్యంతో ఉన్నాడా, లింగ సంబంధిత వ్యాధుల గుర్తింపు చికిత్స, జన్యు జనితమైన జీవకణాలలో కలిగే అసాదరణ మార్పు గుర్తింపు మరియు చికిత్సకై, ఈ సందర్భాల్లో మాత్రమే స్కానింగ్ మిషన్ ని ఉపయోగించుకోవాలని సూచించారు.

పీసీ, పీఎన్డీటీ యాక్ట్, అనుసరించి కొత్తగా, రిజిస్ట్రేషన్ మరియు రెన్యువల్స్, చేసుకోదలచిన వారు జిల్లా కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.అల్ట్రా సౌండ్ స్కానింగ్ మెషిన్ల, రిజిస్ట్రేషన్ గడువు తేదీకి 1 నెల ముందు పిసి,పిఎన్డిటి పోర్టల్ లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అనంతరం జిల్లా కార్యాలయంలో సమర్పించుకోవాలి అని, రిజిస్ట్రేషన్ గడువు పూర్తయినా కూడా నడిపిస్తున్న యజమాన్యాల పైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆస్పత్రి ఆవరణంలోనీ రిసెప్షన్ నిస్ట్ ఉన్న గదిలో మరియు స్కానింగ్ నిర్వహిస్తున్న గదిలో పిసి,పిఎన్డిటి సంబంధించిన ఇక్కడ లింగ నిర్ధారణ చేయబడదని బోర్డును ఏర్పాటు చేయాలని సూచించారు.డయాగ్నస్టిక్ సెంటర్లు ఇమేజింగ్ సెంటర్ల, ఫెర్టిలిటీ సెంటర్ల, స్కానింగ్ మిషన్ ఉపయోగించుకున్న యాజమాన్యాలు, లింగ నిర్ధారణ సంబంధించి, పీసీ, పీఎన్డీటీ యాక్ట్ బుక్ నీ భద్రపరచుకోవాలన్నారు.

స్కానింగ్ నిర్వహించిన ప్రతి గర్భిణీ స్త్రీకి సంబంధించిన సమాచారాన్ని పిసి,పిఎన్డిటి పోర్టల్ లో ఎంట్రీ చేసుకోవాలని.. పామ్ – ఎఫ్ వివరాలను ప్రత్యేకంగా రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. అదేవిధంగా జిరాక్స్ పామ్ – ఎఫ్ ఫారాలను ప్రతి నెల 1 ఒకటవ తారీఖు నుండి 5వ తేదీ లోపల జిల్లా కార్యాలయంలోని డెమో సెక్షన్లో సమర్పించాలి అని సూచించారు. స్కానింగ్ మెషిన్ ని ప్రత్యేక నిపుణులైన, వైద్యులు రేడియాలజిస్ట్, గైనకాలజిస్ట్, ద్వారా మాత్రమే నిర్వహించాలి అని ఆదేశించారు. సలహా కమిటీ సభ్యులు జిల్లా ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకట లింగం మాట్లాడుతూ.. లింగ నిర్ధారణ చేసినట్లయితే, చేపట్టిన వైద్యాధికారికి ప్రోత్సహించిన కుటుంబ సభ్యులకు, పీసీ, పీఎన్డీటీ యాక్ట్ 1994-1996 నిబంధనలను అనుసరించి మొదటి తప్పుకు 10 పదివేల జరిమానా మూడు 3 సంవత్సరాల జైలు శిక్ష, రెండవ తప్పుకు ఐదు 5 సంవత్సరాల జైలు శిక్ష, 50 వేల జరిమానా విధించబడుతుంది. డాక్టర్ యొక్క పట్టా రద్దుకు సిఫారసు చేపడుతుందని హెచ్చరించారు.

అనంతరం సలహా కమిటీ వైద్యులు మాట్లాడుతూ.. ఇల్లీగల్ అబార్షన్స్ నిర్వహించినట్లయితే అట్టి యాజమాన్యాల పై, ఎంటీపీ యాక్ట్ అనుసరించి చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు. అనంతరం సలహా కమిటీ ఎన్జీవో సభ్యులు మాట్లాడుతూ… స్త్రీల నిష్పత్తి తక్కువగా ఉన్న మండలాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటుకు సహాయపడతామని తెలిపారు. అనంతరం పీసీ, పీఎన్డీటీ నోడల్ ఆఫీసర్ డాక్టర్ రజిని ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎంహెచ్ఎన్ మాట్లాడుతూ స్త్రీ, పురుషులు సమానంగా ఉన్నప్పుడే ప్రకృతి పరంగా అసమానతలు ఉండవని వివిధ శాఖల సమన్వయంతో ఆడ శిశువులను రక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సలహా కమిటీ సభ్యులు, డాక్టర్ సుజాత లక్ష్మి, డాక్టర్ వేణు, ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకట్ లింగం, డీపీఆర్ఓ రవికుమార్, స్వార్డ్ ఎన్జీవో సభ్యులు వసంత, రాజలింగం, మెంబర్ కన్వీనర్ డాక్టర్ రజిని, డాక్టర్ శ్రీనివాస్, డిప్యూటీ డెమో నవీన్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News