ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: అక్రమంగా అనుమతులు లేకుండా బ్లాస్టింగ్ నిర్వహిస్తున్న వారిని అదుపు లోకి తీసుకున్న ఘటన శామీర్‌పేట PS పరిధిలోని తూంకుంట గ్రామంలో చోటుచేసుకుంది. శామీర్‌పేట PS పరిధిలోని తూంకుంట గ్రామంలోని ఒక ఓపెన్ సైట్‌లో అక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలు ఉపయోగించి బండ రాళ్లను పేలుస్తుండగా.. కంప్రెసర్ యజమాని విజయ్(44) ను సైబరాబాద్ SOT పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రోజా (సైట్ ఇంజనీర్), కుమార్ (జెలటిన్ & డిటోనేటర్ సరఫరాదారు) పరారీలో ఉన్నారు. ఈ ఘటనలో జెలటిన్ స్టిక్స్ & డిటోనేటర్లు: 03, విలువ రూ.5,000/-, కంప్రెసర్ వాహనం, స్విచ్ బాక్స్, వైర్ బండిల్స్ 2 పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.