ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఇండోనేషియాలో భారీ వర్షాలు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. ఇండోనేషియాలోని పశ్చిమ సుమాత్ర ప్రావిన్స్‌లో సంభవించిన వరదలకు 50 మంది ప్రాణాలు కోల్పోయారు. కుండపోత వర్షాలు, మరాపీ అగ్నిపర్వతం తాలూకు కొండచరియలు విరిగిపడటంతో నదులు ఉప్పొంగినట్లు అధికారులు వెల్లడించారు. వరదల ధాటికి అనేక ఇళ్లు ధ్వంసం కాగా పలు ప్రాంతాలు నీట మునిగాయి. కాగా గల్లంతైన 27 మంది ఆచూకీ కోసం సహాయక సిబ్బంది గాలిస్తున్నారు.