ప్రతిపక్షం, స్పోర్ట్స్: క్రికెట్ లవర్స్‌కు గుడ్ న్యూస్. ఐపీఎల్ 2024 షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 22వ తేదీన ఈ సీజన్ తొలి మ్యాచ్ జరగనుంది. లోక్ సభ ఎన్నికల దృష్ట్యా తొలి 17 రోజులకు సంబంధించిన షెడ్యూల్‌ను మాత్రమే బీసీసీఐ రిలీజ్ చేసింది. మార్చి 22వ తేదీన సీఎస్కే ఆర్సీబీ తలపడటంతో సీజన్ స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 7వ తేదీన లక్నోతో గుజరాత్ టైటాన్స్ తలపడుతుంది. తర్వాత జరిగే మ్యాచ్‌లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించే తేదీలను బట్టి బీసీసీఐ ఖరారు చేయనుంది.
ఏప్రిల్- మే నెలలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికల కోసం అధికారులు, పోలీసులు విధులు నిర్వహిస్తారు. ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగే స్టేడియాల్లో భద్రతా కోసం పోలీసుల అవసరం ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ ఐపీఎల్ మ్యాచ్‌లను 10 నగరాల్లో నిర్వహిస్తారు. చెన్నై, మొహలి, కోల్ కతా, జైపూర్, అహ్మదాబాద్, బెంగళూర్, హైదరాబాద్, లక్నో, విశాఖపట్టణం, ముంబైలో మ్యాచ్‌లు జరుగుతాయి.