మీడియా సమావేశంలో జగ్గారెడ్డి..
ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఐదేళ్లు మా సర్కార్ ఉంటుంది.. డోంట్ వర్రీ అని మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. లక్ష్మణ్ పొలిటికల్ చిప్.. ఖరాబు అయ్యింది.. తక్షణం రిపేర్ చేసుకుని మాట్లాడు.. ఐదేళ్లు మా ప్రభుత్వమే ఉంటుంది. మాకు 65.. బీఆర్‌ఎస్ నుండి మనసు మార్చుకుని 20 మంది.. బీజేపీ నుండి ఐదుగురు వస్తే.. మేము సేఫ్ కదా. అప్పుడు మా బలం 90 కదా.. సీఎం రేవంత్ రెడ్డికి క్లారిటీ ఉంది.. అదే నేను చెప్తున్నా.. కేసీఆర్ పార్టీ విలీనం చేస్తారు అనేది అవివేకం.. చెప్పింది చెయ్యడం గాంధీ కుటుంబానికి అలవాటు అని ఆయన అన్నారు. మోసగాళ్లకు మోసగాళ్ళు బీజేపీ నేతలని బీజేపీ నేతలపై జగ్గారెడ్డి ఫైరయ్యారు.
మోసాలు చేయడంలో బీజేపీ ది ఇంటర్నేషనల్ లో మొదటి ర్యాంక్.. మోడీ ఇచ్చిన హామీలపై మా ఎంపీ అనిల్ తో చర్చకు రా.. అని సవాల్ విసిరారు. బీజేపీ నేతలు శివలింగం మీద పాములాంటి వాళ్ళు.. అందుకే ప్రజలు మొక్కుతున్నారు. శివలింగం దిగిన పాముకు పట్టిన గతే పడుతుంది. బీఆర్‌ఎస్ విలీనం అవుతుందని లక్ష్మణ్ అనడం ఆయన అవగాహన రాహిత్యం అని ఆయన స్పష్టంచేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే లు కాంగ్రెస్‌లోకి రావచ్చు.. బీజేపీ నుండి నలుగురు ఎమ్మెల్యే లు వచ్చినా ఆశ్చర్య పోనక్కర్లేదన్నారు.
గతంలో ఎన్నికలు జరిగితే.. బీఆర్‌ఎస్ పోలీసు లను వాడుకునేదని.. కానీ కాంగ్రెస్ మాత్రం ఎన్నికల కమిషన్ కి సహకారం ఇచ్చిందన్నారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి.. ఈ క్రెడిట్ అంతా కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ ది అని అన్నారు. నిన్ననే ఎన్నికలు అయిపోయాయి .. ప్రెస్ మీట్ ఎందుకు లే అనుకున్న.. కానీ బీజేపీ లక్ష్మణ్ అనవసరంగా మాట్లాడారు. ప్రజలు.. అంతా రిలాక్స్ అయ్యారు. కొంపలు మునిగినట్టు.. లక్ష్మణ్ మాట్లాడటం సరికాదు. లక్ష్మణ్ ఎంపీ నా.. జోత్యిష్యం చెప్తున్నాడా..? అని ప్రశ్నించారు. మూడు నెళ్లలో ఎదో జరుగుతుంది అని మాట్లాడటం అవసరమా..? ఆగస్టు లో కాంగ్రెస్ సంక్షోభం లో పడుతుంది అని అంటున్నాడు. మీ నాయకుడు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు..ఇచ్చాడా..? వాటి కోసం ఆలోచన చెయ్.. మీరు ఇచ్చిన హామీల అమలుపై.. మేము ఇచ్చిన హామీలపై చర్చకు రా..! బట్టకాల్చి మీద వేయడం బీజేపీ కి అలవాటు.. చెప్పింది చెయ్యడం గాంధీ కుటుంబం కి అలవాటన్నారు. ఐదేళ్లు మా ప్రభుత్వం ఉంటుంది.. రేవంత్.. బట్టి.. ఉత్తమ్ ..లాంటి వాళ్లే నడిపిస్తారు సర్కార్ ని అని స్పష్టంచేశారు.