హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ సోమవారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారు. అనంతరం తెలంగాణకు నూతన గవర్నర్‌గా ఝార్ఖండ్ గవర్నర్ సి.పి. రాధాకృష్ణన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. తెలంగాణతో పాటు పుదుచ్చేరి ఎల్జీ (లెఫ్టినెంట్ గవర్నర్)గానూ ఆయనకు అదనపు బాధ్యతలను కట్టబెట్టారు.మరోవైపు తెలంగాణ గవర్నర్‌తో పాటు, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించటం పట్ల ఝార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఎక్స్ వేదికగా స్పందించారు. తనపై నమ్మకంతో అదనపు బాధ్యతలు అప్పగించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.