Trending Now

జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థల వివాదం.. కేసు నమోదు

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ప్లాట్ కొనుగోలు వివాదంలో స్టార్ హీరో ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75 లో ఉన్న ప్లాట్ విషయంలో వివాదం.. ఆయన 2003లో లక్ష్మీ అనే మహిళ వద్ద జూబ్లీహిల్స్‌లో ఒక ప్లాట్ కొన్నారు. అయితే.. ఆ ప్లాట్‌పై ఆమె అప్పటికే లోన్ తీసుకున్న విషయాన్ని దాచిపెట్టారు. అప్పటికే 1996 నుండి పలు బ్యాంకుల వద్ద ఇదే ప్రాపర్టీ మోర్ట్ గెజ్ ద్వారా లోన్స్ పొందిన గీతలక్ష్మి కుటుంబం. దీంతో ప్లాట్‌ను స్వాధీనం చేసుకునేందుకు బ్యాంకులు యత్నించాయి.

అప్పటి నుండి పలు బ్యాంకు మేనేజర్లతో కొనసాగుతున్న వివాదం.. ప్రాపర్టీ ను స్వాధీనం చేసుకునేందుకు బ్యాంక్ మేనేజర్లు ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2019లోనే బ్యాంకు మేనేజర్లపై ఎన్టీఆర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా ఆయనకు వ్యతిరేకంగా DRT రావడంతో కోర్టు మెట్లెక్కారు. దీంతో హైకోర్టులో జూనియర్ ఎన్టీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. జూన్ 3 లోపు DRT డాకెట్ ఆర్డర్ సబ్మిట్ చేయమన్న హై కోర్టు.. జూన్ 6న విచారణ చేపడతామన్న హైకోర్టు.

Spread the love

Related News

Latest News