Trending Now

జిల్లా నేతలతో కేసీఆర్​ సమావేశాలు..

నల్గొండ, చేవేళ్ల నేతలతో భేటీ..

లోక్​సభ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు

హైద‌రాబాద్ , ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: బీఆర్​ఎస్​ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్​రావు వచ్చే లోక్​సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించారు. సోమవారంనాడు బంజారాహిల్స్ నంది న‌గ‌ర్ నివాసంలో కేసీఆర్ నల్గొండ, చేవేళ్ల లోక్‌స‌భ ప‌రిధిలోని ముఖ్య నేత‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల కార్యాచ‌ర‌ణ‌, బీఆర్ఎస్ లోక్‌స‌భ అభ్యర్థి ఎంపికపై ముఖ్యనేతలతో చర్చించినట్లు సమాచారం. అయితే గతంలో నల్గొండ లో క్​సభ నుంచి పోటీకి సై అన్న గుత్త సుఖేందర్​రెడ్డి కుమారుడు నేడు నై అన్నట్లు సమాచారం. అలాగే చేవేళ్ల సిట్టింగ్​ ఎంపీ రంజిత్​రెడ్డి సహితం పోటీ చేయడానికి ఒప్పుకోకపోవడంతో ఈ రెండు నియోజకవర్గాల నుంచి కొత్త అభ్యర్థుల ఎంపికపై గులాబిబాస్​ ఫోకస్​ పెట్టినట్లు సమాచారం. ఈ సమావేశంలో నేతల అభిప్రాయాలను కేసీఆర్​ సేకరించినట్లు సమాచారం. త్వరలోనే అభ్యర్థుల ఎంపికపై ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

Spread the love

Related News

Latest News