ప్రతిపక్షం, తెలంగాణ: రోడ్డు ప్రమాదంలో మరణించిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత పార్థివదేహానికి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. లాస్య నందిత కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.