మహిళలకు కేజ్రీవాల్‌ మరో కానుక..

ఢిల్లీలో ప్రతి మహిళకు రూ.1000 ప్రకటించిన కేజ్రీవాల్..

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢ్లిలీలో ఉంటున్న మహిళలు ఇకపై ప్రతీనెలా రూ. 1,000 అందుకోనున్నారు. ఢిల్లీ అసెంబ్లీలో సోమవారం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి అతిషి మర్లెనా పలు కీలక ప్రకటనలు చేశారు. ఢిల్లీలో ఉంటున్న 18 ఏళ్లు నిండిన మహిళలకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం ప్రతి నెలా రూ.1000 అందజేస్తుందని అతిషి ప్రకటించారు. ‘ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన’ కింద ఈ మొత్తాన్ని అందజేస్తామని తెలిపారు.

Spread the love

Related News