ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్..
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 2 : ఆదిలాబాద్ జిల్లా జైనూర్ దింటి ఆడబిడ్డ ఈ ప్రాంత సమస్యలపై ప్రశ్నించే గొంతుక ఆత్రం సుగుణకు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఖానాపూర్ నియోజవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. గురువారం జైనూర్ మండలంలోని పారా గ్రామంలో ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ ప్రాంత సమస్యలపై గళమెత్తే ఆత్రం సుగుణకు ఒక్క అవ్వకాశం ఇచ్చి చట్టసభలో పంపించాలన్నారు. గోడం నగేష్, ఆత్రం సక్కు ఇన్నేళ్లుగా అధికారంలో ఉండి ఈ ప్రాంత అభివృద్ధికి ఎం చేశారో చెప్పాలని ప్రశ్నించారు.
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటేనని అన్నారు. సబ్బండ వర్గాల అభ్యున్నతికి కృషి చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. బీజేపీ దేవుళ్ళ పేరు మీద రాజకీయం చేస్తుందని అన్నారు. సంస్కృతి, సంప్రదాయాలు, తాత, ముత్తాతల కాలం నుండి ఆచరిస్తూ వస్తున్నామని అన్నారు. కుల, మతాల మధ్య చిచ్చు పెట్టె బీజేపీ పార్టీని భూస్థాపితం చేయాల్సిన అవసరం ఈ దేశ ప్రజలపై ఉందన్నారు. త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి.. ఆత్రం సుగుణను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. అనంతరం పలువురు నాయకులు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.