Trending Now

అబద్దాలకు అంబాసిడర్ కేటీఆర్


మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
త్వరలో ‘కవ్వంపల్లి ’కి ప్రభుత్వ విప్
90శాతం కాంగ్రెస్ సర్పంచ్ లు విజయం
ఏకగ్రీవం పంచాయతీ ‘లకు రూ. 20 లక్షలు

ప్రతిపక్షం, కరీంనగర్​ ప్రతినిధి :
మానకొండూర్ నియోజకవర్గంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, 90 శాతం గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ సర్పంచ్ లు విజయం సాధించడం ఖాయమని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల తరువాత తెలంగాణ ప్రభుత్వం లో ఎమ్మెల్యే కవ్వంపల్లి’కి సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ అధిష్టానం ‘ప్రభుత్వ విప్ పదవి ‘ లాంటి కీలక భాద్యత’లు అప్పగించే పనిలో ఉన్నట్లు వస్తున్న ప్రచారం నేపథ్యంలో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తో ప్రతిపక్షం ప్రతినిధి కి ప్రత్యేక ఇంటర్యూ ఇచ్చారు.

గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి కాగానే మీకు తెలంగాణ ప్రభుత్వంలో కీలక బాధ్యత’లు ప్రభుత్వ విప్’పదవి అప్పగిస్తారని ప్రచారం జరుగుతుంది. మీరేమంటారు?
ఎమ్మెల్యే కవ్వంపల్లి : కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ బలోపేతం కోసం డీసీసీ అధ్యక్షులు గా, ఎమ్మెల్యేగా ఎనలేని కృషి చేశాను. పంచాయతీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయ డంకా మ్రాగిస్తున్నారు. గతంలో మంత్రి పదవి వస్తది అనుకున్నాను. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కూడా నా సేవలు గుర్తించాడు. తెలంగాణ ప్రభుత్వం లో తనకు ఎలాంటి కీలక పదవులు ఇచ్చినా తప్పకుండ నెరవేరుస్తా,

ప్రతిపక్షం ప్రతినిధి: మొదటి, రెండో విడత పంచాయతీ ఎన్నికల సరళి ఎలా ఉంది?

ఎమ్మెల్యే కవ్వంపల్లి : కరీంనగర్ జిల్లాలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మ రథం పడుతున్నారు. మొదటి విడతలో 90 శాతం కాంగ్రెస్ సర్పంచులు గెలుపొందారు. రెండో విడత కూడా 90 శాతం పంచాయతీ’లను కైవసం చేసుకుంటాం.

ప్రతిపక్షం ప్రతినిధి: ఇప్పటి వరకు ఏకగ్రీవం ఎన్ని అయినాయి?

ఎమ్మెల్యే కవ్వంపల్లి : మానకొండూర్ నియోజకవర్గం లో మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో ఇప్పటికే 11 చోట్ల కాంగ్రెస్ సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయినాయన్నారు. తాను ముందుగా ప్రకటించినట్లు ఏక గ్రీవమైన కాంగ్రెస్ పంచాయతీ లకు ఒక్కో పంచాయతీ కి రూ. 20 లక్షలు ఆయా పంచాయతీ ల అభివృద్ధి కోసం అందజేస్తానని స్పష్టం చేశారు.

ప్రతిపక్షం ప్రతినిధి: ప్రజల తీర్పు, తీరు ఎలా ఉంది? కాంగ్రెస్ కు అనుకూలంగా ఉందని అనుకుంటున్నారా?

ఎమ్మెల్యే కవ్వంపల్లి :ప్రస్తుతం జరుగుతున్న రెండో విడత ఎన్నికల్లోనూ 90 శాతం కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తారని ఆశిస్తున్నాను. కరీంనగర్ జిల్లాలో కూడా కాంగ్రెస్ కు చాలా వరకు అనుకూల పవనాలు కనిపిస్తున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీ కి పట్టం కడుతున్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్ళాయి. బీఆర్ఎస్ 92 శాతం గెలిసిందని కేటీఆర్ ప్రచారం చేస్తున్నారు.

ప్రతిపక్షం ప్రతినిధి: బీఆర్ఎస్ కు ప్రజలు బ్రహ్మ రథం పడుతున్నారని కేటీఆర్ అంటున్నారు? ఇందులో నిజమేంత..?

ఎమ్మెల్యే కవ్వంపల్లి : ఎమ్మెల్యే సమాధానమిస్తూ కేటీఆర్ అబద్దాలు ఆడడంలో అంబాసీడర్ అని, ఆయన మాటలు ఎవరూ నమ్మడం లేదన్నారు. సత్యాన్ని అసత్యం చేయడం నమ్మించే ప్రయత్నం చేయడం కేటీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య అని అభివర్ణించ్చారు.

ప్రతిపక్షం ప్రతినిధి: కాంగ్రెస్ అభ్యర్థులు కొన్ని చోట్ల ఓడిపోయారు?.. ఆయా చోట్ల ఓటమి కి ప్రధాన కారణాలు ఏంటి?

ఎమ్మెల్యే కవ్వంపల్లి : గ్రామాలలో చూస్తే తెలుస్తుంది. కొన్ని చోట్ల మా పార్టీ వారే రెబల్ గా ఇద్దరూ, ముగ్గురూ ఉన్న చోట కేవలం 10 లేక 20 ఓట్ల తేడా తో ఓడిపోయారు. ఆది మేం ఓటమి అనుకోవడం లేదు. ఒకే పార్టీ వారు ఒకే చోట ముగ్గురేసి పోటీలో ఉండడం వల్ల కొన్ని చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారు.

ప్రతిపక్షం ప్రతినిధి: పంచాయతీ ఎన్నికల్లో మీరు ఎక్కడ ఓటు వేస్తున్నారు?
ఎమ్మెల్యే కవ్వంపల్లి : రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో తాను పుట్టి పెరిగిన మానకొండూర్ మండలం పచ్చునూరు గ్రామంలో తాను, కుటుంబం ఓటు వేసి తన ఓటు హక్కును వినియోగించు కున్నానని ఎమ్మెల్యే కవ్వంపల్లి పేర్కొన్నారు.

Spread the love

Related News