ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: డైరెక్టర్ శేఖర్ కమ్ముల, తమిళ స్టార్ హీరో ధనుష్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘కుబేర’. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోండగా, తాజాగా ఆమె ఫస్ట్ లుక్ గ్లింప్స్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటగా వైరల్‌గా మారింది. ఇక ఈ చిత్రాన్ని ఏషియన్ సినిమాస్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పీ రామ్‌మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.