ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: నందమూరి నటసింహం బాలయ్య వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.. అఖండ, వీరసింహా రెడ్డి సినిమాలతో అదిరిపోయే హిట్స్ అందుకున్న బాలయ్య గత ఏడాది భగవంత్ కేసరి మూవీతో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నారు. కాగా, బాలయ్య తదుపరి చిత్రంపై ఫ్యాన్స్ అంచనాలు పీక్స్ లో వున్నాయి.. బాలకృష్ణ 109 వ చిత్రాన్ని డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్నారు. మార్చి 8న మహా శివరాత్రి కావడంతో Nbk 109 చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. శివరాత్రి కానుకగా మార్చి 8న పవర్ ఫుల్ గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. బాలయ్య ముఖం కనిపించకుండా ఒక పోస్టర్ ను రిలీజ్ చేసారు.. ఈ పోస్టర్ లో బాలయ్య మరోసారి ఊచకోత మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. గొడ్డలి పట్టుకుని వెహికల్ నుంచి దిగుతున్నట్లు ఈ పోస్టర్ ఉంది.