ప్రతిపక్షం, హుస్నాబాద్ ఏప్రిల్ 8: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో శ్రీ మరకత లింగేశ్వర స్వామి ఆలయం ప్రక్కన నిర్మిస్తున్న
“శ్రీ వేంకటేశ్వరస్వామి” దేవాలయానికి నిర్మాణ కమిటీ కన్వీనర్ గా తిరుమల ఫర్టిలైజర్స్ అధినేత శ్రీ మంతెన ప్రభాకర్ రావుని, దేవాలయ నిర్మాణ కమిటీ గౌరవ అధ్యక్షులుగా మున్సిపల్ మాజీ చైర్మన్ సుద్దాల చంద్రయ్యని సోమవారం రోజున నియమించినట్లు శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ నిర్మాణ కమిటీ తెలిపారు. త్వరలో దేవాలయ నిర్మాణ కమిటీ మిగతా కార్యవర్గాన్ని ప్రకటిస్తామని అన్నారు. హుస్నాబాద్ పట్టణ ప్రజలందరూ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణం పూర్తికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని, ఆ దేవుని కృపకు పాత్రులు కాగలరని నిర్మాణ కమిటీ తరఫున శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణ కమిటీ అధ్యక్షుడు వరయోగుల మురళీధర్ స్వామి, దేవాలయ నిర్మాణ కమిటీ సభ్యులు కోరారు.