Trending Now

ఢిల్లీలో భారీ పేలుడు.. 9 మంది మృతి

ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద ఘటన
పార్క్​చేసిన కారులలో పేలుడు

ప్రతిపక్షం, న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ ఒకటి వద్ద సోమవారం సాయంత్రం ఒక కారులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా మరికొంత మంది గాయపడినట్టు తెలుస్తొంది. పార్క్​చేసి ఉంచిన కారులో పేలుడు సంభవించిందని ఢిల్లీ అగ్నిమాపక శాఖ తెలిపింది. ఈ ఘటనలో మూడు నుండి నాలుగు వాహనాలు మంటల్లో చిక్కుకుని దెబ్బతిన్నాయని సమాచారం. మంటలను అదుపు చేయడానికి అధికారులు అగ్నిమాపక దళాలను సంఘటనా స్థలానికి తరలించారు. సీఎన్జీ సిలిండర్ పేలుడు కారణమని అధికారులు అనుమానిస్తున్నారు. ఖచ్చితమైన కారణం ఏంటనేది ఇంకా అధికారులు నిర్ధారించలేదు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love

Related News