ప్రతిపక్షం, తెలంగాణ: నల్గొండ జిల్లా కేంద్రంలోని జడ్పీ ఆఫీస్ లో అగ్ని ప్రమాదం జరిగింది. కార్యాలయంలోని ఆడిట్ ఆఫీసులో అర్ధరాత్రి మంటలు వచ్చాయి. మంటలు ఎగిసిపడడంతో ఫర్నీచర్, ఫైల్స్ కాలిబూడిదయ్యాయి. అగ్నిప్రమాదం పై ఫైర్ సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇచ్చాడు నైట్ వాచ్ మెన్. దీంతో మంటలను ఆర్పివేశారు ఫైర్ సిబ్బంది. అగ్నిప్రమాదంపై నల్గొండ పోలీసులు విచారణ చేస్తున్నారు. షార్ట్ సర్కూట్ తో ప్రమాదం జరిగిందా.. ?ఎవరైనా కావాలని చేశారా..? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.