ప్రతిపక్షం, మెదక్ ఏప్రిల్ 23: మెదక్ జిల్లాలో విశిష్టత గాంచిన చాకరిమెట్లలోని అంజన్నస్వామి వారిని మంగళవారం ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ దర్శించుకున్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని చాకరి మెట్లలోని శ్రీ సహకార ఆంజనేయ స్వామివారిని మెదక్ డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డిలతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నీలం మధుతో ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు చేశారు. జడ్పీటిసి సుహాసిని, ఐఎన్ టీయూసి జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి, రవీందర్ రెడ్డి, లక్ష్మీపతిరావు, శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.