ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌లో ఈరోజు ముంబై, లక్నో వాంఖడేలో తలపడనున్నాయి. రెండు జట్లు ప్రతిష్ఠ కోసం ఆడనున్నాయి. ముంబై ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప LSG కథ కూడా ముగిసినట్లే. ఉదాహరణకు.. తాము 200 స్కోర్ చేసి ముంబైని 100లోపు ఆలౌట్ చేసినా లక్నో రన్ రేట్ -0.351కు మాత్రమే చేరుతుంది. ఆర్సీబీ, సీఎస్కే రెండూ భారీ రన్‌రేట్‌తో ఉన్న నేపథ్యంలో లక్నోకు ప్లే ఆఫ్స్ దాదాపు అసాధ్యం.
మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్‌కు సన్ రైజర్స్..
నిన్న ఉప్పల్ వేదికగా జరగాల్సిన SRH-GT మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. సాయంత్రం నుంచి కొనసాగిన వాన ఎంతకీ తగ్గకపోవడంతో టాస్ వేయకుండానే మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఇరు జట్లకూ చెరో పాయింట్ దక్కింది. దీంతో మరో లీగ్ మ్యాచ్ మిగిలి ఉండగానే 15 పాయింట్లతో సన్ రైజర్స్ నేరుగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. GT ఇప్పటికే ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.
IPL నుంచి ఢిల్లీ ఎలిమినేట్..
సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించడంతో ఢిల్లీ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆ జట్టు 14 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. టాప్ 4లో ఉన్న KKR, RR, SRH, CSKకు 14కుపైనే పాయింట్లు ఉన్నాయి. అలాగే ఈ జట్లకు తలో మ్యాచ్ మిగిలి ఉంది. దీంతో ఢిల్లీ నాకౌట్ రేసు నుంచి తప్పుకుంది. మరోవైపు ఈనెల 18న CSKతో మ్యాచ్‌లో RCB 18 పరుగుల తేడాతో లేదా 18.1 ఓవర్లలో 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తేనే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది.