ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: IPLలో ఈరోజు మరో ఆసక్తికర పోరు జరగనుంది. ముంబైలోని వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఆడిన 2మ్యాచుల్లోనూ గెలిచి రాజస్థాన్ జోరు మీదుంది. మరోవైపు ముంబై ఆడిన రెండింట్లోనూ ఓడి పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగున ఉంది. ఈరోజు గెలిచి బోణీ కొట్టాలని MI పట్టుదలతో ఉంది. ఇరుజట్లు ఇప్పటివరకు 28మ్యాచుల్లో తలపడగా.. ముంబై 15, రాజస్థాన్ 12 మ్యాచుల్లో గెలిచాయి. ఒక దాంట్లో ఫలితం రాలేదు.