Trending Now

భద్రద్రిలో ‘ఇందిరమ్మ ఇళ్ల’కు శ్రీకారం.. మంత్రి కీలక ప్రకటన

ఈనెల 7న సీఎం చేతుల మీదుగా ప్రారంభం..

మంత్రి పొంగులేటి వెల్లడి..

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: గత ఎన్నికల సమయంలో ఇళ్లు లేని నిరుపేదలకు స్వంతింటి కళ నిజం చేస్తామని, అందులో భాగంగానే ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని చేపడుతామని ఇచ్చిన హామీని ఈనెల 7న సీఎం భద్రాదిలో ప్రారంభించబోతున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, పౌరసంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి తెలిపారు. సోమవారం నాడు సత్తుపల్లిలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ప్రజలు ఆశించిన మేరకు పరిపాలన సాగిస్తున్నామని చెప్పారు. పేదవాడికి తోడు నీడగా ఉండాలనేదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. విద్యా, వైద్యం, మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని అన్నారు. సింగరేణి ప్రభావిత ప్రజలను వారు ఆదుకోవాలని చెప్పారు.

రెవిన్యూ సెక్టార్‌లో అవినీతి పూర్తిగా అంతరించాలని అధికారులను ఆదేశించారు. టీఎస్పీఎస్సీ ద్వారా పారదర్శకంగా నియామకాలు చేపడతామని అన్నారు. ఇప్పటికే సుమారు 22 వేల ఉద్యోగాల ఇచ్చామని చెప్పారు. మెగా డీఎస్సీని ప్రకటించామని.. 11 వేల ఉద్యోగ నియామకాలను పార్లమెంట్ ఎన్నికల కోడ్‌కు ముందుగానే చేపడతామని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పద్ధతులు మానుకోవాలని.. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలకు మంచిచేసేలా అధికారులు ముందుకు వెళ్లాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న ధరణి అప్లికేషన్లను యుద్ధప్రాతిపదికన పరిష్కరించేలా మండల స్థాయిలో అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

Spread the love

Related News

Latest News