AP CM Chandrababu Missed Accident in Vijayawada: ఏపీ సీఎం చంద్రబాబుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. విజయవాడలోని మధురానగర్‌లో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఆయన.. వరదను పరిశీలించేందుకు రైలు వంతెనపైకి వెళ్లారు. అనంతరం అక్కడి పరిస్థితులను తెలుసుకునేందుకు బ్రిడ్జిపై నడిచి బుడమేరు ఉధృత్తిని పరిశీలించారు.
రైలు వంతెనపై చంద్రబాబు నడుస్తుండగానే ఒక్కసారిగా ఎదురుగా రైలు వచ్చింది. వెంటనే అప్రమత్తమైన ఆయన రైలు తగలకుండా పక్కకు నిలబడడంతో పెను ప్రమాదం తప్పింది. అంతకుముందు భద్రతా సిబ్బంది ఎంతకీ వారించనప్పటికీ ఆయన వినలేదు. ఈ సమయంలో ఆయనకు అతిసమీపంలో రైలు వెళ్లడంతో అందరూ ఒక్కసారిగా ఆందోళన చెందారు. అయితే రైలు వెళ్లిపోయిన తర్వాత అధికారులు, భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.