హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్అరెస్ట్ను ఖండిస్తున్నామని, ప్రధాని మోదీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వచ్చిన అక్రమ సంపాదనపై సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలన్నారు. ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చిన, తీసుకున్న వారిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం కేజ్రీవాల్‌ను అనేక బెదిరింపులు, వేధింపులకు గురి చేసిందని ఆరోపించారు. అయినా కూడా ఆయన లొంగకపోవడంతో అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలను నిర్వీర్వ్యం చేయాలని బీజేపీ చూస్తున్నదని విమర్శించారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నది. సీఏఏ తీసుకొచ్చింది అందుకోసమేనని తెలిపారు. బీజేపీ కుట్రలను ఎదుర్కోవడంలో కాంగ్రెస్ విఫలమవుతుందన్నారు. ఏదో ఒక కేసులో రేవంత్ రెడ్డిని జైల్లో వేసినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదన్నారు.