Trending Now

ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి.. జీవన్ రెడ్డి

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: మోడీ ఎన్నికల నియమావళిని గౌరవించాల్సిన వ్యక్తి ఉల్లంఘిస్తున్నాడని ఎంఎల్సీ జీవన్ రెడ్డి అన్నారు. గాంధీ భవన్‌లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్ని మాట్లాడారు. కాంగ్రెస్ వస్తే రామాలయాన్ని బుల్డోజర్ తో కూల్చేస్తారు అనడం దారుణమని.. ఈ మాట విశ్వాసాలను రెచ్చగొట్టడమే.. ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బుల్డోజర్ ని తెర మీద తీసుకు వచ్చింది బీజేపీనేనని.. వాస్తవానికి, రామాలయం దేవాలయ గేట్లును 1986లో తెరిచింది రాజీవ్ గాంధీ అని.. కోర్టు తీర్పు గౌరవించి హిందువుల మనోభావాలు గౌరవించే విధంగా రామ్ లల్లా గేట్స్ తెరిచింది రాజీవ్ గాంధీ.. దేవాలయ గేట్స్ తెరిచినపుడు మోడీ ఎక్కడ ఉన్నాడని ఆయన ప్రశ్నించారు. బి. బహదూర్ సింగ్ సీఎం గా ఆనాడు ఉండే.. అపుడు గుడి శంకుస్థాపన కి అనుమతి ఇచ్చింది రాజీవ్ గాంధీనే గుర్తుచేశారు. కాంగ్రెస్ మాట సామరస్యానికి ప్రతీకగా.. ఏ దేశం లో లేని విధంగా వివిధ మతాలకు సెక్యులర్ విధాలకు కట్టుబడి ఉంది కాంగ్రెస్.

రాజీవ్ గాంధీ 1989 లో ఎలక్షన్ కాంపెయిన్ మొదలు అయ్యింది. రాజీవ్ గాంధీ అధికారం లోకి వచ్చి ఉంటే అపుడే నిర్మాణం పూర్తి అయ్యేది. బీజేపీ ఎన్నికొల కోసం గుడిని వాడుకోవడం సరికాదన్నారు. దేశంలో మత విశ్వాసాలు రెచ్చగొట్టడం తో ఈ అంశం తీవ్రం అయ్యింది. దేశంలో ధార్మిక చింతన పెంపొందించింది రాజీవ్ గాంధీ.. పీఎం ఉన్నపుడు దూరదర్శన్ లో రామాయణ, మహా భారతాలు ప్రసారం చేయబడ్డాయని గుర్తుచేశారు. బీజేపీ మోడీ వచ్చాకే రామ మందిర నిర్మాణానికి అంకురార్పణ జరిగింది అన్నట్లు చేస్తున్నారు. కానీ రాజీవ్ గాంధీ ఉన్నపుడే అంకురార్పన జరిగింది. అప్పుడు కేంద్రంలో బూటసింగ్ హోమ్ మినిస్టర్. నువ్వు ఒక్కడివే దేవుడిని కొలుస్తా అని చెప్పుకుంటే ఎలా..? శ్రీరాముడు ఆదర్శ దేవుడిగా, పాలనలో ప్రజాభిప్రాయాన్ని విలువని ఇచ్చిన వ్యక్తి శ్రీరాముడని.. అటువంటి శ్రీరామ పాలనను రాజీవ్ గాంధీ అదర్శంగా తీసుకున్నాడు. ఆయన 1989 ఉపన్యాసాలు వినండి.. దూరదర్శన్ ఎవరి ఆలోచన విధానానికి అనుగుణంగా టెలికాస్ట్ చేయబడ్డాయి, మతారస్యానికి లోక విధాననికి కట్టుబడి ముందుకు పోతుందన్నారు.

హిందువుల మనోభావాలు గౌరవించేది గాంధీ కుటుంబం.. దీనికి సుభ్రమణ్యస్వామినే చెప్పాడు ఆయనే సాక్ష్యమన్నారు. మీ రాజకీయ స్వార్థం కోసం మీరు మాట్లాడుతున్నారు. అయోధ్య లో రామ మందిర నిర్మాణానికి మూలం న్యాయస్థానం. ఇవాళ మందిర నిర్మాణం జరిగింది జరుగుతుంది అంటే అది న్యాయస్థాన తీర్పులే. మీడియాకి విజ్ఞప్తి మీరు ఉన్న రికార్డ్స్ ని తీయండి ఎపుడు రామాయాలయం కి శంకుస్థాపన జరిగింది తెలుస్తుందన్నారు. సెక్యులరిజం అంటే అందరి భావలను గౌరవించడమేనన్నారు.

Spread the love

Related News

Latest News