ప్రతిపక్షం, వెబ్డెస్క్: ఢిల్లీలో జరిగిన ఎన్డీయే సమావేశంలో కీలక తీర్మానానికి నేతలు ఆమోదం తెలిపారు. NDA పక్షనేతగా మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తీర్మానంపై చంద్రబాబుతో పాటు 21 మంది నేతలు సంతకాలు చేశారు. దీంతో ఎల్లుండి సాయంత్రం 5 గంటలకు మోదీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. మంగళవారం విడుదలైన ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది.
ఇక ముచ్చటగా మూడోసారి మోడీ ప్రధాని పీఠంపై కూర్చోనున్నారు. సుమారు గంటన్నర పాటు కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. ఈ రోజు రాష్ట్రపతి వద్దకు మోదీ, అమిత్ షా, చంద్రబాబు, నితీశ్ వెళ్లే అవకాశం ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ద్రౌపది ముర్మును కోరనున్నారు.