ప్రతిపక్షం, ఏపీ: చిరంజీవి కనీసం ఒకచోటైనా గెలిచాడు.. పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయిన వ్యక్తి అని పవన్‌పై ఎంపీ కేశినేని నాని కౌంటర్ ఇచ్చారు. పవన్ తెలంగాణలో ఉంటూ.. ఏపీలో గెస్ట్ రోల్ పోషిస్తాడు.. జనసైనికుల అభిమానాన్ని చంద్రబాబుకు ప్యాకేజ్‌గా అమ్మేశాడు.. చంద్రబాబు దగ్గర ముష్టి 24 సీట్లు తీసుకున్నాడు.. అంటూ పవన్‌పై సంచలన కామెంట్స్ చేశారు.
చంద్రబాబు, లోకేష్ రాష్ట్రానికి చీడ పురుగులు.. స్పెషల్ ప్యాకేజ్ ఇస్తే ఫస్ట్ లిస్ట్, మామూలు ప్యాకేజ్ ఇస్తే రెండో లిస్ట్‌లో లోకేష్ సీట్లు ఇస్తున్నాడు.. ఏం ప్యాకేజ్ లేని వాళ్లకు సీట్లు లేవు.. సీట్లు అమ్మడంలో లోకేష్ నంబర్ వన్ అంటూ లోకేష్‌పై ఎంపీ కేశినేని నాని ఫైరయ్యారు.