NC-Congress alliance secures 48 seats Jammu & Kashmir: జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఈ మేరకు నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమి గెలుపొందింది. నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి 48 చోట్ల నెగ్గింది. ఇందులో నేషనల్ కాన్ఫరెన్స్ 42, కాంగ్రెస్ 6 స్థానాల్లో గెలిచాయి. అయితే, బీజేపీ సొంతంగా 29 స్థానాల్లో విజయం సాధించడం గమనార్హం. ఇక, పీడీపీ 3, జేపీసీ 1, సీపీఐ (ఎం) 1, ఆప్ 1, ఇతరులు 7 స్థానాలు దక్కించుకున్నారు. కాగా, దేశంలో తీవ్ర ఉత్కంఠ సృష్టించిన జమ్మూ – కశ్మీర్ లో రాష్ట్ర హోదా పునరుద్ధరణ తరువాత జరిగిన ఎన్నికలు పోటా పోటీగా జరిగాయి. ఇందులో 90 అసెంబ్లీ స్థానాలకు గాను నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమి 48 స్థానాలు కైవసం చేసుకున్నాయి.