Neeraj: డైమండ్‌ లీగ్‌ ఫైనల్‌కు నీరజ్‌ చోప్రా అర్హత

భారత జావెలిన్ త్రో స్టార్, పారిస్ ఒలింపిక్స్ విజేత నీరజ్ చోప్రా మరో ఘనత సాధించాడు. ప్రతిష్టాత్మక డైమండ్‌ లీగ్‌కు అర్హత సాధించాడు. బ్రస్సెల్స్‌ వేదికగా సెప్టెంబర్ 13, 14వ తేదీల్లో ఈ పోటీలు జరగనున్నాయి. జూరిచ్‌ డైమండ్ లీగ్‌లో పాల్గొననప్పటికీ.. నీరజ్‌ 14 పాయింట్లతో నాలుగో స్థానం సాధించి బ్రస్సెల్స్‌ లీగ్‌ ఫైనల్‌కు అర్హత సాధించాడు. గ్రెనెడా అథ్లెట్ అండర్సన్ పీటర్స్ (29 పాయింట్లు), జర్మనీ క్రీడాకారుడు జులియన్ వెబర్ (21 పాయింట్లు), చెక్ రిపబ్లిక్‌ స్టార్ జాకుబ్ (16 పాయింట్లు) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.

Spread the love

Related News