ప్రతిపక్షం, వెబ్ డెస్క్: క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్ FTX కో ఫౌండర్ శామ్ బ్యాంక్‌మన్‌కు న్యూయార్క్ కోర్టు 25ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆర్థిక మోసాలు, నగదు అక్రమ లావాదేవీల నేరాలకు అతను పాల్పడినట్లు న్యాయమూర్తి నిర్ధారించారు. కస్టమర్ల డబ్బు ఇతర మార్గాల్లోకి వెళ్తోందనే విషయం తెలిసినా శామ్ అబద్ధం చెప్పారని ఫైరయ్యారు. 2019లో FTXను ఏర్పాటు చేయడంతో అతని సంపద 26 బిలియన్ డాలర్లకు చేరింది. తర్వాత చేసిన తప్పులతో ఆస్తులను కోల్పోయారు.