ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 4 : రాష్ట్ర మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ని నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ పలువురు కౌన్సిలర్లు శనివారం ఉదయం అయిన నివాసానికి వెళ్లి కలిశారు. బుధవారం రాత్రి కాంగ్రెస్ లో చేరిన మాజీ మంత్రి అల్లోల శుక్రవారం సాయంత్రం నిర్మల్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ చేరిక కార్యక్రమాన్ని నిర్వహించగా.. ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్న నిర్మల్ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు శనివారం వ్యక్తిగతంగా మాజీ మంత్రి అల్లోలను కలిసి పలు విషయాలు చర్చించారు. అయితే వివిధ కారణాల వల్ల కాంగ్రెస్ ను వీడిన వారు.. లేదా ఇతర రాజకీయ పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి వస్తున్న వారిని నేరుగా అధిష్టానం ఇచ్చిన ఆదేశాలు, సూచనల మేరికే గాంధీ భవన్ లో కాంగ్రెస్ కండువాలు వేసి ఆహ్వానిస్తున్నామని వారందరినీ కలుపుకొని పోయే బాధ్యత మన అందరిదని ఈ విషయంలో ఎవరు ఎలాంటి అలకతో ఉన్న ,వ్యతిరేకంగా పనిచేసిన అధిష్టానం సీరియస్ గా ఉందని మంత్రి సీతక్క శుక్రవారం రాత్రి హెచ్చరించారు.
కాంగ్రెస్ కండువాలు కప్పుకున్న వారందరినీ కలుపుకొని పోయి ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపు కోసం కృషి చేయాలని మన భవిష్యత్తు ప్రధాని రాహుల్ గాంధీ కావాలని ఆమె ఈ సందర్భంగా పేర్కొనడంతో శనివారం ఉదయం నుంచే పలువురు నేతలు మాజీ రాష్ట్ర మంత్రి అల్లోలను వ్యక్తిగతంగా కలవడం.. శాలువాలు వేసి బోకేలు ఇచ్చి శుభాకాంక్షలు తెలపడం నిర్మల్ లో జరుగుతుంది. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కూడా భవిష్యత్తు దేశ పరిస్థితి, రాజకీయ పరిణామాలు, తదితర విషయాలను వచ్చిన వారందరికీ చెబుతూ అదిలాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపు కోసం అందరం కలిసికట్టుగా ఉండి కష్టపడదామని భరోసా ఇవ్వడంతో పాటు దేశ భవిష్యత్తు కాంగ్రెస్ దేనిని ప్రగాఢ విశ్వాసంతో చేరుకుంటుండడం కోసం మెరుపు.