ప్రతిపక్షం, వెబ్ డెస్క్: ఐపీఎల్-2024 ఎడిషన్‌లో భాగంగా బుధవారం ఉప్పల్ వేదికగా ఎస్‌ఆర్‌హెచ్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ జరిగింది. అయితే, ఆ మ్యాచ్‌ను వీక్షించేందుకు ముంబై ఫ్రాంచైజీ ఓనర్, రియలన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ఆమె సికింద్రాబాద్ పరిధిలోని ప్రముఖ బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించుకున్నారు. అనంతరం ఆలయంలోని ఎల్లమ్మ, పోచమ్మ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బల్కంపేట ఎల్లమ్మ విశిష్టతను ఆలయ నిర్వహకులు ఆమెకు వివరించారు. సుమారు 15 నిమిషాల పాటు నీతా అంబానీ ఆలయంలో గడిపారు.