ప్రతిపక్షం, ప్రతినిధి హనుమకొండ, మే 11: ఎన్నికలకు అంత సిద్ధమైంది, ఇందుకు సంబంధించిన మూడో వ ర్యాండమైజేషన్ ప్రక్రియ అధికారులు పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఈనెల 13వ తేదీన పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని ఎన్ఐసీ హాల్ లో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల విధులకు కేటాయించిన సిబ్బంది మూడో ర్యాండమైజేషన్ ప్రక్రియను శనివారం నిర్వహించారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ జనరల్ అబ్జర్వర్ బండారి స్వాగత్ రణ్వీర్ చంద్ సమక్షంలో వరంగల్ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య ఎన్నికల సిబ్బంది కేటాయింపునకు సంబంధించిన మూడవ ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు.
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ కేంద్రాలలో విధులు నిర్వర్తించే ఎన్నికల సిబ్బంది జాబితాను ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఆయా జిల్లాల కలెక్టర్లు అందజేశారు. ఈ ర్యాండమైజేషన్ ప్రక్రియలో హనుమకొండ, జనగామ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లు సిక్తా పట్నాయక్, రిజ్వాన్ భాషా షేక్, భవేష్ మిశ్ర, అదనపు కలెక్టర్లు వెంకట్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.