ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ సభ్యులు వీర హనుమాన్ విజయ యాత్ర తలపెట్టారు. ఉ.8 గంటలకు గౌలిగూడ రామ మందిర్‌లో యజ్ఞంతో హనుమాన్ పూజలు ప్రారంభమవుతాయి. 11.30గం. యాత్ర ప్రారంభమవుతుంది. కోఠి ఆంధ్రాబ్యాంక్ చౌరస్తా వద్ద బహిరంగ సభ నిర్వహిస్తారు. కర్మన్‌ఘాట్, సైదాబాద్, మలక్‌పేట్ ప్రాంతాల నుంచి వచ్చే ర్యాలీలు కోఠిలో ప్రధాన యాత్రతో కలిసి తాడ్‌బన్ హనుమాన్ దేవాలయం వరకు కొనసాగుతుంది.
నేడు హనుమాన్ జయంతి..
చైత్ర మాసం శుక్ల పక్షం పౌర్ణమి రోజున అంజనీ దేవి కుమారుడిగా ఆంజనేయుడు జన్మించాడని నమ్ముతారు. అందుకే హిందూ మతంలో హనుమాజ్ జయంతికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ ఏడాది ఏప్రిల్ 23న హనుమాన్ జయంతి జరుపుకోనున్నారు. హనుమంతునికి ఎంతో ప్రీతికరమైన మంగళవారం రోజు హనుమాన్ జయంతి రావడం అత్యంత శుభకరం. హనుమంతుడిని ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు ఉపవాసం ఉంటారు.