Trending Now

ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను సైబరాబాద్ SOT పోలీసులు పట్టుకున్నారు. వారి నుండి రూ. 43,57,461/- స్వాధీనం చేసుకున్నారు. పక్క సమాచారం అందుకున్న సైబరాబాద్ SOT మాదాపూర్ టీం, మియాపూర్ పీఎస్ పరిధిలోని మాతృశ్రీ నగర్ లోని శ్రీనిధ సర్వీస్ అపార్ట్‌మెంట్, ఫ్లాట్ నంబర్: 505 పై దాడి చేయగా.. నలుగురు పట్టుకుని వారి వద్దనుండి నగదు రూ. 40,00,000/- లతో పాటు ల్యాప్ టాప్స్, టాప్స్, మొబైల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు. విచారణ చేయగా గుంటూరు నర్సారావు పేట కు చెందిన శాకమూరి వెంకటేశ్వర్ రావు @ చిన్ను ఆద్వర్యం లో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు తెలిసింది. అరెస్ట్ కాబడిన నిందితులు శాకమూరి వెంకటేశ్వర్ రావు ఆధ్వర్యంలో బూకీలుగా చేస్తున్నారు.

Spread the love

Related News

Latest News