ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: పాకిస్థాన్ ఉమెన్ క్రికెటర్లు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బిస్మా మరూఫ్, లెగ్ స్పిన్నర్ గులాం ఫాతిమా ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు మహిళా క్రికెటర్లకు గాయాలు అయినట్లు సమాచారం. ప్రమాదానికి గురైన వెంటనే వాళ్లకి ప్రథమ చికిత్స అందించారు. ప్రస్తుతం వాళ్లిద్దరు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్నట్లు పీసీబీ ప్రకటించింది.